గజ్వేల్, డిసెంబర్ 4: ప్రజల గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే మాజీమంత్రి హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నరని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. హరీశ్‌పై కోపంతో చక్రధర్‌గౌడ్ ద్వారా ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని చెప్పారు.
జూన్‌లో ఫిర్యాదు చేస్తే నవంబర్‌లో కేసు విత్‌డ్రా చేసుకున్నారని గుర్తుచేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ పూర్తి రుణమాఫీ చేయకుండా చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మాజీ జడ్పీటీసీ మల్లేశం, మండలాధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్ చందు, కనకయ్య పాల్గొన్నారు.