నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 13 : జోగుళాంబ గద్వాల జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఓ అధికారిణికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. మొదట తన కుమారుడితో ఫోన్ చే యించి తర్వాత తానే ఫోన్ తీసుకొని ‘నేను ఫోన్చేస్తే ఎందుకు ఎత్తడంలేదు’ అని నిలదీశారు. తాను క్లాసులో ఉ న్నందున ఫోన్ ఎత్తలేదని చెప్పారు.
ఉద్యోగుల జాబితా కలెక్టర్కు ఇచ్చానని, కావాలంటే అక్కడ తీసుకోవాలని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే.. నీవు ఇక్కడ ఉంటా వా? లేకుంటే పోతావా? అని బెదిరించారు. ఉండమంటే ఉంటా? పొమ్మం టే పోతా? అని ఘాటుగా బదులిచ్చా రు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 15 రోజుల క్రితం ఆ అధికారి మాజీ ఎమ్మెల్యే ఒ త్తిడి తట్టుకోలేక బదిలీపై వనపర్తి వెళ్లిన ట్టు సమాచారం. ఇదే జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, అనుచరుల బెదిరింపులపై విచారణ చేస్తున్నట్టు కో దండాపురం ఎస్సై తరుణ్కుమార్రెడ్డి తెలిపారు.