హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి తెలుగు సినిమా కథానాయకుడు అల్లు అర్జున్‌కు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. అత్యున్నత పురస్కారం ద్వారా తాత, తండ్రి, మేనమామల కీర్తి పెంచారని, తెలుగు సినిమాకు మరింత వన్నె తెచ్చారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వైభవ పతాకాన్ని రెపరెపలాడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు గర్వించేలా చేశారని తెలిపారు. అల్లు రామలింగయ్య వారసుడిగా వచ్చిన అర్జున్ తెలుగు సినీ పరిశ్రమను అల్లుకుపోయిన తీరు అబ్బురమని పేర్కొన్నారు. నాట్యం, నటనలో సవ్యసాచి అని నిరూపించుకున్న అర్జున్‌కి అభినందనలు తెలిపారు.