హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి ఉపన్యాసాలు దంచే ముందు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పాపాలను గుర్తు చేసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కాంగ్రెస్ ద్రోహాలను దేశ చరిత్ర నుంచి ఎప్పటికీ, ఎవరూ తుడిచి పెట్టలేరని.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగస్ఫూర్తిని ఉల్లంఘిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు.