యాదగిరిగుట్ట, నవంబర్ 9 : తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారడం ఖాయమని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను, ఆయన చరిత్రను ఎవ్వరూ టచ్ చేయలేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్రంతో కొట్లాడి రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిని అసభ్యకరమైన భాషతో మాట్లాడటం అహంకారమేనని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.