హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాధకుడు కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవన యాత్రలో బీఆర్ఎస్పై సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ ట్వీట్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాకనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.