హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ భవన్లో శుక్రవారం టీఎస్ ఆర్టీసీ లైసెన్స్ కూలీ (హమాలీ) నూతన సంఘం ఆవిర్భవించింది. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్మిక నేత ఎల్ రూప్సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మిక వర్గానికి సిసలైన నాయకుడు అని కొనియాడారు. ఆర్టీసీని రక్షించిన కేసీఆర్ కూలీలను ఆదుకొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం సంఘం కమిటీ ఎన్నికైంది. గౌరవ అధ్యక్షుడిగా ఎల్ రూప్ సింగ్, అధ్యక్షుడిగా కే మారుతీ, ప్రధాన కార్యదర్శులుగా జే భాసర్, టీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా పీ సీతయ్య, కోశాధికారి జీ రవి, ఏ వెంకటస్వామి ఎన్నికయ్యారు