చిక్కడపల్లి, నవంబర్ 23 : గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావసభ ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా గరిగె ఉపేంద్ర, మహిళా అధ్యక్షురాలిగా శిరీషరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా అర్జున్, విజయకుమార్, కోశాధికారిగా ఈశ్వర్, సెక్రటరీ జనరల్స్‌గా లక్ష్మీనరసింహులు, వీర న్న, అసోసియేట్ అధ్యక్షులుగా చంద్ర య్య, చిరంజీవి, ఉపాధ్యక్షులుగా రమేశ్, ప్రతిభ, నర్సింహారావు, లక్ష్మీనారాయణ, నాగలక్ష్మి, కార్యదర్శులుగా ప్రసాద్, శ్రీనివాస్, సునీత, మల్లీశ్వరి, కోటేశ్వర్రావు ఉన్నారు.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికుల సమస్యలు పర్కిరించాలని వర్కర్లు సోమవారం ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. తెలంగాణ స్టేట్ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించనున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, దీంతో అప్పులు చేయాల్సి వస్తున్నదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బిల్లులు చెల్లించడంతోపాటు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమండ్ చేశారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఆటంకం లేకుండా విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం అందించాలని స్పష్టంచేసింది.