హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : వివిధ ప్రాజెక్టు అవసరాల కోసం అటవీభూముల కేటాయింపుల సందర్భంగా పర్యావరణానికి, వన్యప్రాణుల ఆవాసాలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్‌ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వన్ సంరక్షణ్, సంవర్ధన్ రూల్స్ -1980 అనుసరించి ఈ కమిటీ పనిచేయనున్నది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చైర్‌పర్సన్‌గా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, చీఫ్ వైల్డ్‌లైఫ్ అధికారి, రెవెన్యూశాఖ ప్రతినిధి, సీసీఎల్ఏ ప్రతినిధిగా మాలతి, పర్యావరణశాఖ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ మేరకు శుక్రవారం అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.