హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): గెజిటెడ్ ఆఫీసర్లు మొదలు అడిషనల్, జాయింట్ సెక్రెటరీల (నాన్‌క్యాడర్) వరకు పదోన్నతుల కోసం ప్రభుత్వం డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీలను (డీసీపీ) నియమించింది. సీఎస్ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంబంధిత శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా నియమించింది.
29 శాఖల పరిధిలో మూడో స్థాయి గెజిటెడ్, ఆపైస్థాయి పదోన్నతులకు మరో రెండు కమిటీలు వేసింది.