ఎల్లారెడ్డి రూరల్ (గాంధారి) అగస్ట్ 6: కామారెడ్డి జిల్లాలో మరో రైతు ఆత్మహత్య కు ప్రయత్నించాడు. గాంధారి మండలం సీతాయిపల్లికి చెందిన కుర్ర చిన్న మల్లయ్య 30 ఏండ్లుగా ఫారెస్ట్ భూమిలో కబ్జాలో ఉంటున్నాడు. ప్రస్తుతం వరిపంట వేశాడు. ఇది అటవీ భూమి అని పేర్కొంటూ ఫారెస్ట్ అధికారులు బుధవారం వచ్చి ఏపుగా పెరిగిన పంటపై గడ్డి మందు పిచికారీ చేయించారు. దీంతో మస్థాపం చెందిన మల్లయ్య గడ్డిమందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఎల్లారెడ్డిపేట దవాఖానకు తరలించారు. ఎఫ్ఆర్వో హేమచందన మా ట్లాడుతూ, కబ్జా స్థలంలో పంట వేయవద్దని మూడుసార్లు హెచ్చరించామని తెలిపారు. అయినా వినకుండా వరి వేయడంతో పంటపై గడ్డి మందు స్ప్రే చేయిస్తామని ముందే చెప్పామని వెల్లడించారు.