ఖానాపూర్, అక్టోబర్ 8 : టింబర్ డిపో లైసెన్స్ పునరుద్ధరణకు రూ.12 వేల లంచం తీసుకుంటూ ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిండ్ల రవీందర్ ఏసీబీకి చికారు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన ఓ టింబర్ డిపో రెన్యువల్ కోసం యజమాని ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నాడు.
ఎఫ్ఎస్వో రవీందర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయగా రూ.12 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. గురువారం ఖానాపూర్ అటవీ కార్యాలయ ఆవరణలో బాధితుడు రూ.12 వేలు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు ఎఫ్ఎస్వోను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడు అటవీశాఖ కార్యాలయం ఎదుట పటాకులుకాల్చి సంబురాలు చేసుకున్నాడు.