హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తె లంగాణ): అటవీ సిబ్బందిపై దాడులు జ రుగుతున్నాయని, వీటిని అడ్డుకోవడానికి ఆయుధాలు ఇవ్వాలని, పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి నా ప్రభుత్వం స్పందించడం లేదని ఓ అధికారి తెలిపారు. తాము పంపిన ప్రతిపాదనలను అమలు చేయాలంటే రూ.61 కోట్లు ఖర్చు అవుతాయని వెల్లడించారు. అటవీ శాఖ మంత్రి సురేఖ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామని తెలిపారు.