కరీంనగర్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో (Satavahana University) ఎలుగుబంటి మరోసారి హల్చల్ చేసింది. వర్సిటీ సమీపంలోని మల్కాపూర్‌లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు మల్కాపూర్‌లో గాలించినప్పటికీ అది ఎక్కడా కనిపించలేదు. అయితే పాదముద్రల ఆధారంగా విశ్వవిద్యాలయంలో దట్టంగా ఉన్న చెట్లవైపు వెళ్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
ఈఏడాది మార్చి నెలలో యూనివర్సిటీలోని నీటి గుంత వద్దకు వచ్చిన ఎలుగుబంటి.. 15 నిమిషాల పాటు అక్కడే కలియతిరింది. దానిని చూసిన ఓ విద్యార్థిని ఎలుగుబంటిని తన ఫోన్లో రికార్డ్ చేసింది. వర్సిటీ అధికారుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటీకీ దాని జాడ తెలియరాలేదు.