హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వేసవికి ముందే అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 164కు పైగా ప్రమాదాలు జరగటంతో అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారిక లెకల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1నుంచి మార్చి 10 వరకు కేవలం రెండు నెలల్లోనే 11,434 అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
నిరుడు 14,027 ప్రమాదాలు జరుగగా, ఈఏడాది ఆదిలోనే ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. భద్రాద్రి సరిల్లో అత్యధికంగా 3,243 అగ్ని ప్రమాదాలు నమోదు కాగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,479, కాళేశ్వరం 2,080, బాసర 1,784, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ 924, రాజన్న-సిరిసిల్ల 788, చార్మినార్ సరిల్లో 146 ప్రమాదాలు నమోదయ్యాయి. మానవ తప్పిదాలే ఈ దుస్థితికి ప్రధాన కారణమని అధికారులు చెప్పారు.