హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మాసబ్ ట్యాంక్‌లోని గిరిజన మ్యూజియంలో విదేశీయులు సందడి చేశారు. గయానా, టాంజానియా, సురినామె, నేపాల్, శ్రీలంక దేశాలకు చెందిన మీడియా అధికారులు, ప్రతినిధులకు ఎంసీహెచ్ఆర్టీలో శిక్షణ కొనసాగుతున్నది. దీనిలోభాగంగా తెలంగాణ గిరిజన సంసృతి, జీవన విధానాలను అవగాహన చేసుకోవడానికి ఆయా దేశాల ప్రతినిధులు మ్యూజియాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బంజారా మహిళలు తయారు చేసే పొట్లి అనే అరుదైన కానుకను అందించారు. కార్యక్రమంలో సంస్థ సంచాలకులు డాక్టర్ వీ సముజ్వల, మ్యూజియం క్యురేటర్ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ ఈ-స్టూడియో అధికారులు పాల్గొన్నారు.