హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): సరదాగా గడిపేందుకు విశాఖ బీచ్‌కి వచ్చిన విదేశీయుల్లో అలల తాకిడికి ఇద్దరు కొట్టుకునిపోయి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇటలీ నుంచి 16మంది పర్యాటకులు విశాఖలోని యారాడ బీచ్‌కు వచ్చారు. అక్కడ సముద్ర తీరం లోతు తెలియకపోవడంతో తీరంలో ఆడుకుంటూ సముద్రం లోపలికి వెళ్లారు.
ఈక్రమంలో ఇద్దరు పర్యాటకులను అలలు ఒక్కసారిగా లోపలికి లాక్కుకునిపోయాయి. దీంతో వారి కేకలు విన్న స్థానికులు లైఫ్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. వెంటనే వారు కొట్టుకుపోతున్న ఇద్దరిని రక్షించి బయటకు తీసుకురాగా, అప్పటికే ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమచారం.