హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘మీరు ముఖ్యమంత్రి గారి ఫొటోలకు క్షీరాభిషేకాలు చేయండి. ఇది డీజీపీ గారి ఆర్డర్. మీరు చేస్తారా? లేకపోతే డ్యూటీలు మార్చమంటారా?’ అంటూ ఆయా జిల్లాల్లోని హోంగార్డులకు పోలీసు ఉన్నతాధికారు ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో కొందరు హోంగార్డులు తమకు ఇష్టం లేకపోయినా.. ఎక్కడ ఉద్యోగం పోతుందోనన్న భయంతో పాలతో అభిషేకాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ‘అన్నా.. ఇవాల్టి వరకు జీతం పడలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 79 రూపాయలు పెంచి.. వెయ్యి రూపాయలు పెంచినట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
మే ము కొందరం క్షీరాభిషేకాలు చెయ్యబోమని తెగేసి చెప్పాం. అధికారులు ఎవరైనా మరీ బ లవంతం చేస్తే.. పురుగుమందు డబ్బాలు పట్టుకొని పోలీస్ స్టేషన్లలోనే ఆందోళనలు చే స్తాం’ అంటూ ఖమ్మానికి చెందిన ఓ హోంగా ర్డు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఇప్పటికే మహబూబ్‌నగర్, నిర్మల్, నల్లగొండలో బలవంతంగా హోంగార్డులతో సీఎం ఫొటోలకు క్షీ రాభిషేకాలు చేయించారని, ఖమ్మంలో చే యించేందుకు కూడా సమాయత్తం అయ్యార ని, ఆ క్రమంలోనే ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.
హోంగార్డుల సమస్యలపై, డీఏగా అతితక్కువగా రూ.79 పెంచడంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే భయంతోనే తమతో క్షీరాభిషేకాలు చేయిస్తున్నారని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రూ.79 పెంపు తో హోంగార్డులు సంతోషంగా ఉన్నారు’ అన్నట్టు బలవంతంగా చూపిస్తున్నారని తమ బాధను మీడియా ముందు వ్యక్తంచేస్తున్నారు.
హోంగార్డులుగా పోలీసుశాఖలోకి తీసుకున్న ట్రాన్స్‌జెండర్స్‌కు ఇస్తున్న విలువ ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న తమకు ఇవ్వడం లేదని వాపోతున్నారు. వారు ఉద్యోగంలో చేరడంతోనే డ్యూటీ అలవెన్స్‌ను ఇచ్చిన ప్రభుత్వం.. తమకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం 75 ఏండ్ల హోంగార్డుల సర్వీసును అవమానపర్చడమేని అంటున్నారు. ఇకనైనా హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరుతున్నారు. తమను పర్మినెంట్ చేసి, రోజుకు రూ.1500 వేతనం ఇస్తామని చెప్పిన మాటను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.