Former Minister Laxma reddy | ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్య పెడుతారు ? కాంగ్రెస్కు మాజీ మంత్రి సూటి ప్రశ్న
Former Minister Laxma reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు కావడం లేదని బీఆర్ఎస్ నాయకుడు , మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
జడ్చర్ల : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు కావడం లేదని బీఆర్ఎస్ నాయకుడు , మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం అంబేద్కర్ కళా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సగం రోజులు గడిచిపోయాయని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఇంకెన్ని రోజులు ప్రజలను మభ్య పెడుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ అత్యంత అవినీతిమయమైందని, మంత్రులు మధ్య వాటా పంచాయితీ ఎప్పుడూ చూడలేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజల సంక్షేమం,అభివృద్ధిపై పట్టింపు ఉండదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెండు లక్షల ఎనబై వేల కోట్లు మాత్రమే అప్పు చేసిందని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందని గుర్తు చేశారు. మూడేండ్లు పూర్తి కాక ముందే మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారని ప్రభుత్వాన్ని లక్ష్మారెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతున్నామని అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు.
మూడున్నర లక్షల కోట్ల అప్పుతో మీరు చేసిన పనులు కనిపించడం లేదు. ప్రాజెక్టులు లేవు. సంక్షేమం లేదు. హామీల అమలు లేదని అన్నారు. రైతు భరోసా నిధులు మూడుసార్లు ఎగ్గొట్టి మోసం చేశారని ఆరోపించారు. బడ్జెట్ లో అంకెల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని, పేపర్ లో మాత్రమే అంకెలను అటు ఇటు మార్చి చెప్పినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఫలితాలు రావని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

