హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ వేర్హౌస్లపై ఫుడ్సేఫ్టీ అధికారులు గురువారం దాడులు చేశారు. జెప్టో, రిలయన్స్, జియోమార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టా మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా స్థానిక సముదాయాలపై దాడులు కొనసాగాయి. 75 యూనిట్లను పరిశీలించి 222 శాంపిళ్లను సేకరించారు. 1,903 కాలం చెల్లిన ఆహార పదార్థాల ప్యాకెట్లను సీజ్ చేసినట్టు ఫుడ్సేఫ్టీ కమిషనర్ వెల్లడించారు.