హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : మార్కెట్లో ఓఆర్ఎస్ పేరిట ఆయా బ్రాండ్లు యథేచ్ఛగా సాగిస్తున్న దందాపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉక్కుపాదం మోపింది. ఇక నుంచి ఆయా బ్రాండ్లు ‘ఓఆర్ఎస్’ అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ముద్రించొద్దని హెచ్చరించింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ర్టాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై తయారు చేసే తమ ఉత్పత్తులపై డబ్ల్యూహెచ్వో రికమెండ్ చేసిన ‘ఓఆర్ఎస్ ఫార్ములా’ కాదు అని ముద్రించాలని సూచించింది.
\చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇ ప్పటికే ఆయా సంస్థలు తయారు చేస్తున్న తమ ఉత్పత్తులపై వెంటనే ఓఆర్ఎస్ అనే పదాన్ని తొలగించాలని ఆదేశించింది. ఓఆర్ఎస్ పేరిట జరుగుతున్న విచ్చలవిడి దందాపై హైదరాబాద్కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డా. శివరంజిని సంతోష్ ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నా రు. ఓఆర్ఎస్ పేరిట జరుగుతున్న అమ్మకాలపై ఆమె హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకు లేఖ రాశారు. తాజాగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులపై ఆమె హర్షం వ్యక్తంచేశారు.