హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక దవాఖానలో ఫుడ్ పాయిజన్ జరిగి ఒకరు మృతి చెందడం, మరో 69 మంది అస్వస్థతకు గురికావడం అత్యంత బాధాక రం.. అసలు ఈ ఘటనకు బాధ్యులెవ రు? సీఎం, ఆరోగ్యశాఖ ఏం చేస్తున్నట్టు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణనష్టమని విమర్శించారు. కాంగ్రెస్ పాలన లో ఫుడ్ పాయిజన్లు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణంగా మా రిందని మండిపడ్డారు. మానసిక వైద్యం పొందేందుకు దవాఖానకు వచ్చిన పేషంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దికుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు. అస్వస్థతకు గురయ్యారని తెలిసిన తర్వాత కూడా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపడం అమానుషమని ధ్వజమెత్తారు. ఉస్మానియా దవాఖానలో క్లిష్ట పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతోపాటు, మిగతా 67 మందికి నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఎర్రగడ్డ ఇన్చార్జి ఆర్ఎంవోపై వేటు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఫుడ్‌పాయిజన్ ఘటన నేపథ్యంలో దవాఖాన ఇన్చార్జి ఆర్ఎంవో పద్మజపై ప్రభుత్వం వేటు వే సింది. ఆమెను రిలీవ్ చేస్తూ వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చోంగ్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆమె స్థానంలో ఉస్మానియా దవాఖాన ఆర్ఎంవోగా పనిచేస్తున్న డిప్యూటీ సివి ల్ సర్జన్ భాస్కర్‌ను ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ఇన్చార్జి ఆర్ఎంవోగా నియమించారు. డైట్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం మరో ఉత్తర్వులో పే ర్కొన్నది. ఈ ఘటనపై న్యాయవాది ఇమ్మానేని రామారావు బుధవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫి ర్యాదు చేశారు. దీంతో ఎస్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. త్వరలోనే విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.