TSWREIS | హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో మరో అడ్డగోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సొసైటీ సెక్రటరీ విధులు నిర్వర్తించే చోటుకే ఓ అధికారిణి వా లిపోవడమే అందుకు కారణం. అందులో ఆంతర్యమేమిటని? సొసైటీ ఉన్నతాధికారు లే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు గు సగుసలాడుకుంటున్నాయి. సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ ఫైనాన్స్ విభాగంలో అడిషనల్ సెక్రటరీగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అడిషనల్ జాయింట్ రిజిస్ట్రార్‌గా వి ధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ కిరణ్మయిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులను జా రీచేసింది.
సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి ఎ క్కడ పనిచేస్తే అక్కడికి ఈ అధికారి వాలిపోవడం గమనార్హం. సొసైటీ సెక్రటరీ వర్షిణి గ తంలో ఆయుష్ విభాగంలో పనిచేయగా ఇదే కిరణ్మయి ఆమె వద్ద విధులు నిర్వర్తించారు. అనంతరం అక్కడి నుంచి చేనేత జౌ ళిశాఖకు వెళ్లగా అక్కడికి సైతం కిరణ్మయి డి ప్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం సోషల్ వె ల్ఫేర్ సెక్రటరీగా వర్షిణి విధులు నిర్వర్తిస్తుండగా, మళ్లీ ఇదే సొసైటీకి డిప్యుటేషన్‌పై అడిషనల్ సెక్రటరీగా రావడం కొసమెరుపు. ఇ దే ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురుకుల సొసైటీ సె క్రటరీగా అలుగు వర్షిణి మే నెలాఖరులో బా ధ్యతలు చేపట్టారు.
ఆ వెంటనే నెలరోజులు తిరగకుండానే సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఫైనా న్స్ డిపార్ట్మెంట్కు సీనియర్ అడిషనల్ సె క్రటరీ అవసరమని, అందుకు డాక్టర్ కిరణ్మయిని నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి ఆమె లేఖ పెట్టడం గమనార్హం. దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మేడం ఎక్కడికి వెళ్తే కిరణ్మయి సైతం అక్కడికే వె ళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య అంతటి అనుబంధమేమిటోనని అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు.
సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీగా డిప్యూటేషన్‌పై నియమితులైన డాక్టర్ కిరణ్మయిపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆమె డిప్యూటేషన్లు ఆగకపోవడం గమనార్హం. ఆయుష్ డిపార్ట్మెం ట్ ఉద్యోగులే కాదు, చేనేత జౌళిశాఖ ఉద్యోగులు సైతం బాహటంగానే పలు విమర్శులు చేశారు.