ములుగు రూరల్, మార్చి 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరవరానికి చెందిన మొగిలిపల్లి సువర్ణకుమారి రూ.1,17,700 విలువైన 582 చీరలను గురువారం రాత్రి వాహనంలో తరలిస్తున్నట్టు గుర్తించి ములుగు జిల్లా కేంద్రంలో పట్టుకున్నామని ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ అధికారి సదయ్య తెలిపారు.