సీఎం కేసీఆర్ వల్లే ఫ్లోరైడ్ అంతం అంతమైంది : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagdish Reddy | సీఎం కేసీఆర్ వల్లే ఫ్లోరైడ్ అంతం అంతమైందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించింది. ప్లోరైడ్ భూతం చుట్టుముట్టింది. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మునుగోడు దశ తిరగింది. ఫ్లోరైడ్ అంతమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మర్రిగూడెం, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికి శ్రీరామ రక్ష. గులాబీ జెండా నీడలోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. అందుకే కేంద్రం కేంద్రం సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వడం లేదన్నారు.
తెలంగాణపై విషం చిమ్ముతూ బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణాపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే కేసీఆర్‌ను అపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. దేశ ప్రజలు తెలంగాణా సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నరు. అందుకే బీజేపీ నాయకులు కేసీఆర్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు.
మునుగోడులో గులాబీ పార్టీ కార్యకర్తలు సైనికులవ లే పని చేయాలని, బీజేపీ కుట్రల్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,
జడ్పీ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

