నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. నిండు కుండలా మారుతున్న జలాశయాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిసరాలు కళకళలాడుతున్నాయి.
సాగర్ ప్రస్తుత నీటిమట్టం 582.70 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 290.80 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. జలాశయం ఇన్ఫ్లో 2.81 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 41,028 క్యూసెక్కులుగా ఉంది.