అమరచింత, మే 16: క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య మొదలైన గొడవలో ఓ యువకుడిపై ఐదుగురు వ్యక్తు లు దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. నాగల్కడ్మూర్, ధర్మాపూర్కు చెందిన యువకులు మంగళవారం మధ్యాహ్నం క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఆంజనేయులు(30)పై ఐదుగురు వ్యక్తులు దాడి చేయడంతో గాయపడ్డాడు.
కుటుంబ సభ్యులు ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. గురువారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ విషయమై రెండు గ్రామాల పెద్దలు పంచాయితీ నిర్వహించి మృతుడి కుటుంబసభ్యులకు రూ.12 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.