Weather Report | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, సరిహద్దు వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని చెప్పింది.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతాయని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతాయని పేర్కొంది.