హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్తను సేకరించడానికి అవసరమైన వాహనాలున్న గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర భాగాన నిలిచింది. జాతీయ స్థాయిలో 33 శాతం మాత్రమే ప్రతి నుంచి చెత్త సేకరించడానికి, తరలించడానికి వాహనాలు ఉండగా.. తెలంగాణలో 99.9 శాతం వాహన సౌకర్యం ఉన్నట్టుగా తేలింది. ఘన వ్యర్థాల నిర్వహణ దేశవ్యాప్త సగటు 70 శాతం ఉండగా, తెలంగాణలో వందకు వందశాతం జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో వెల్లడైంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వివరాలు