అమరావతి : విజయవాడ ( Vijayawada ) గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్( Bullet ) లభ్యమవడం కలకలం సృష్టిస్తోంది. యూపీకి చెందిన కానిస్టేబుల్ ఆనంద్‌కుమార్ యాదవ్ తన సోదరుడికి విజయవాడలోని విట్ వర్సిటీలో ఇంటర్వ్యూ ఉండడంతో తోడుగా వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బ్యాగులో బుల్లెట్ ఉన్నట్లు ఎయిరిండియా ప్రతినిధులు గుర్తించి అతన్ని గన్నవరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.