Satchidananda Panda: అమెరికా ల్యాబ్‌లో లైంగిక వేధింపుల ఘటన.. రాజీనామా చేసిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త
Satchidananda Panda: ప్రఖ్యాత శాస్త్రవేత్త సచ్చిదానంద పండా.. కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ కంపెనీకి రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదు అయ్యాయి. ఆ రీసెర్చ్ సెంటర్లో సుమారు 22 ఏళ్లుగా ఆయన వివిధ పరిశోధనలు నిర్వహించారు.
వాషింగ్టన్: భారతీయ మూలాలు ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త సచ్చిదానంద పండా(Satchidananda Panda) .. కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ కంపెనీకి రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు నమోదు అయ్యాయి. ఆ రీసెర్చ్ సెంటర్లో సుమారు 22 ఏళ్లుగా ఆయన వివిధ పరిశోధనలు నిర్వహించారు. ప్రముఖ బయోలజిస్ట్గా ఆయనకు గుర్తింపు ఉన్నది. ఆగస్టు 13వ తేదీ నుంచి ఆయన రాజీనామా అమలులోకి రానున్నది. ఆయన ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ మహిళా రీసర్చ్ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సాల్క్ కంపెనీ దర్యాప్తు చేపట్టింది. వర్క్‌ప్లేస్‌లో అసభ్య ప్రవర్తన కారణంగా ప్రస్తుతం ఆయన్ను అడ్మినిస్ట్రేషన్ లీవ్‌పై పంపారు.
అయితే సచ్చిదానందపై ఫిర్యాదు చేసిన మహిళ తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఏడాది రెండో సారి సచ్చిదానందపై వేధింపుల ఆరోపణల్లో సాల్క్ కంపెనీ విచారణ చేపట్టింది. కానీ తానేమీ లైంగిక వేధింపులకు పాల్పడలేదని శాస్త్రవేత్త సచ్చిదానంద పండా తెలిపారు. గత కొన్ని వారాల నుంచి పండా ఆఫీసుకు రావడం లేదని సాల్క్ ఉద్యోగులు తెలిపారు. సిర్కాడియన్ రిథమ్స్ గురించి బుక్ రాయనున్నట్లు సచ్చిదానంద చెప్పారు. ఉపవాసాల వల్ల ప్రయోగాల గురించి కూడా ఆయన స్టడీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సచ్చిదానందకు మంచి పరిశోధకుడిగా గుర్తింపు ఉన్నది. ఈయన వల్లే సాల్క్ కంపెనీకి మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

