– ఈ నెల 24న కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా అందజేత
మునుగోడు, జూలై 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలను పంపిణీ చేశారు. కేటీఆర్ అభిమాని గురజా సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశ్, పాఠశాల హెచ్ఎం బాలప్రసాద్, సీనియర్ ఉపాధ్యాయులు సత్యారెడ్డి, విద్యాసాగర్, సదాలక్ష్మి, సబిత, గీతావాణి, అయితగోని విజయ్ గౌడ్ గుర్రాల సురేష్, నాగరాజ్సాయి రాజ్ పాల్గొన్నారు.

మునుగోడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ