Polling Percentage | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది. ఒంటిగంటవరకు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని 39 జీపీలలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏటూరునాగారం మండలంలో 70.49% పోలింగ్ నమోదయింది. గోవిందరావుపేట మండలంలో 70.27% పోలింగ్ నమోదయింది. తాడ్వాయి మండలంలో అత్యధికంగా 81.89% పోలింగ్ నమోదయింది.
పలు జిల్లాల్లో పోలింగ్ శాతం వివరాలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ 82.26 శాతంగా నమోదైంది.
జనగామ జిల్లాలో పోలింగ్ శాతం 78.57 శాతం
ఆసిఫాబాద్ జిల్లాలో 77.07 శాతం
పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ శాతం 82.27 శాతం
సంగారెడ్డి జిల్లాలో 84.71 శాతం
హనుమకొండలో 81.39 శాతం
నల్లగొండ జిల్లాలో 81.63 శాతం
ఖమ్మం జిల్లాలో 86.95 శాతం
సూర్యాపేట జిల్లాలో 89.69 శాతం
మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ 83.04 శాతం
మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ 86.99 శాతం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత 78.58 శాతం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79 శాతం
