భద్రాచలం: ఎగువన భారీ వర్షాలతో గోదావరి నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్నది. రాములవారి పాదాల చెంత గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం 43.50 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. 9,07,616 క్యూసెక్కుల నీరు పారుతున్నది.