Drunk and Drive | మంచిర్యాల అర్బన్, నవంబర్ 7: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మద్యంప్రియులకు మంచిర్యాల జిల్లా కోర్టు వినూత్న తీర్పునిచ్చింది. వారంపాటు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించింది. ఇటీవల మంచిర్యాలలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించగా.. 27 మంది మద్యంప్రియులు పట్టుబడ్డారు.
వీరిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, మొదటి అడిషనల్ సివిల్ జడ్జి ఉపనిషద్విని వినూత్న తీర్పునిచ్చారు. వారంపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంసీహెచ్ పరిసరాలను పరిశుభ్రం చేయాలని తీర్పునిచ్చారు. ఈ మేరకు గురువారం మంచిర్యాల ట్రాఫిక్ ఏఎస్సై జీ నందయ్య మద్యంప్రియులను తీసుకొచ్చి ఎంసీహెచ్ పరిసరాలను శుభ్రం చేయించారు. ఎవరైనా గైర్హాజరైతే తిరిగి వారంపాటు పనులు చేయించనున్నారు.