హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో అగ్నిమాపక శాఖ సంసిద్ధత, బడ్జెట్ కేటాయింపులు, ఫైర్ స్టేషన్ల ఫునరుద్ధరణ, ఆధునిక వాహనాలు, రెస్క్యూ పరికరాలు, విపత్తుల ప్రణాళిక, కేసుల ప్రాసిక్యూషన్ స్థితిగతులపై ఆ శాఖ డీజీ నాగిరెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సమర్థవంతంగా పని చేసేందుకు, శాఖను మెరుగుపర్చేందుకు రూట్ మ్యాప్ అందించారు. 483 మంది అగ్నిమాపక సిబ్బంది నియామకంతో అగ్నిమాపక కేంద్రాలను బలోపేతం చేసినట్టు తెలిపారు. ఫైర్మెన్లు సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. సమావేశంలో అన్ని జిల్లాల అగ్నిమాపక అధికారులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.