Mahathma Gandhi | కంటోన్మెంట్, నవంబర్ 3: భావి భారత పౌరులు సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు. రీల్స్ చేయాలనే తాపత్రయంలో విచక్షణ కోల్పోయి ఆకతాయి పనులు చేస్తున్నారు. అలా కొందరు మైనర్ బాలురు ఏకంగా జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహం నోటిలో పటాకులు పెట్టి పేల్చారు. ఆపై ఆ పైశాచిక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ కంటెన్మెంట్లో జరిగింది. ఆ ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు ఆ వీడియోను హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్నాప్ చాట్లో వచ్చిన వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నలుగురు మైనర్ బాలురను నిందితులుగా గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వెల్లడించారు.
ముంబైలో మరో ఘటన
ఇటీవల ముంబైలో సైతం ఇలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడు కుక్క తోకకు పటాకులు కట్టి నిప్పంటించాడు. అవి పేలడంతో ఆ కుక్క గాయపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. నోరులేని మూగ జంతువు పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ యువకుడిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
Request @CVAnandIPS garu to kindly take suo motu action on this indecent act with Gandhi ji’s statue in Bowenpally Police Station Limits, Cantonment.
It has become a fashion to insult the Father of this Nation. pic.twitter.com/YqARsXpMid
— Krishank (@Krishank_BRS) November 3, 2024