లక్నో, అక్టోబర్ 26: మొన్న ఏపీలో, నిన్న రాంచీలో ప్రయాణికుల బస్సుల్లో మంటలు చెలరేగి దగ్ధం కాగా, తాజాగా యూపీలో ఒక డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్కు నిప్పంటుకోగా, ప్రయాణికులు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై రెవ్రీ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడ లేదనిఅధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ నుంచి గోండాకు లక్నో మీదుగా 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్లో ఆదివారం ఉదయం 4.45 గంట సమయంలో రెవ్రీ టోల్ ప్లాజాకు 500 మీటర్ల ముందు ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. అనంతరం బస్ మంటల్లో దగ్ధమైంది.