Hyderabad Metro | మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ మైట్రో స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. మెట్రో రైల్వే స్టేషన్ కింద గల విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మెట్రో రైల్ సిబ్బంది అప్రమత్తమై రైల్వే స్టేషన్లో లిఫ్ట్ నిలిపివేశారు. ఈ సమాచారం తెలిసిన అగ్ని మాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు నిలిపేశారు.