ఆదిలాబాద్: జిల్లాలోనే ఉట్నూర్ మద్యం డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు వెల్లడించారు. రూ.కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.