కరీంనగర్: కరీంనగర్లోని (Karimnagar) సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుభాష్ నగర్లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్రమంగా పక్కన ఉన్న పూరిళ్లకు వ్యాపించడంతో ఐదు వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడిపడుతున్నాయి. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇండ్లలో నివసిస్తున్నవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.