జనగామ: జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ షామింగ్ మాల్లో మంటలు అంటుకున్నాయి. దీంతో పక్క షాకులకు విస్తరించాయి. పట్టణంలోని విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్లో వస్త్రాలు ఉండటంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. క్రమంగా అవి పక్కన ఉన్న దుకాణాలకు కూడా విస్తరించాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ప్రాణ హాని జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిళినట్లు వెల్లడించారు. కాగా, నీటి నిళ్వ సామర్థ్యం తక్కువగా ఫైరింజన్ల వల్ల మంటలను అందుపుచేయడానికి ఎక్కువ సమయం పట్టిందని, దీంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు తెలిపారు.