సీఎం ఢిల్లీ పర్యటనపై పోస్టు..‘తెలుగు స్ర్కైబ్’పై మరో కేసు
తెలుగు ప్రజలకు నిరంత రం వార్తలను పోస్టుల రూపంలో అందిస్తున్న తమపై రేవంత్ సర్కార్ అకసు వెళ్లగక్కుతున్నదని ‘తెలుగు స్ర్కైబ్' ని ర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల లెక వేసినందుకు తెలుగు స్రైబ్పై కొత్తగా కేసులు కట్టారని చెప్పారు.
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : తెలుగు ప్రజలకు నిరంతరం వార్తలను పోస్టుల రూపంలో అందిస్తున్న తమపై రేవంత్ సర్కార్ అకసు వెళ్లగక్కుతున్నదని ‘తెలుగు స్ర్కైబ్’ ని ర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల లెక వేసినందుకు తెలుగు స్రైబ్పై కొత్తగా కేసులు కట్టారని చెప్పారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ) అధికారులు ఈనెల 14న ఖైరతాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. అత్యంత కఠినమైన బీఎన్ఎస్ సెక్షన్లు 303(2), 317(2), 316(2), 125 43(బీ), ఆర్/డబ్ల్యూ 66 ఐటీ యాక్టు సెక్షన్లతో కేసు నమోదు చేశారని చెప్పారు.
ఇప్పటికే తెలుగు స్రైబ్పై అక్రమంగా ‘ఉపా’ కేసు పెట్టిన రేవంత్ ప్రభుత్వం.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తమ డిజిటల్ చానళ్లపై 200పైగా అక్రమ కేసులు పెట్టిందని చెప్పారు. ఓ పథకం ప్రకారం తెలుగు స్రైబ్పై ఏదో ఒక కేసును ప్ర భుత్వం పెట్టిస్తున్నట్టు తెలిపారు. సర్కా ర్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు, ప్రజా సమస్యలపై పోస్టులు వేస్తున్నందుకే కేసులు పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు ఖండించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

