హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ఫిన్లాండ్ (ఫిన్నిష్) విద్యావిధానం. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యావ్యవస్థ. ఈ దేశంలో 98% సర్కార్ స్కూళ్లే.. కేవలం 2% మాత్రమే ప్రైవేట్ స్కూళ్లుంటాయి. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు గల ఈ దేశ విద్యావిధానాన్ని మన విద్యాశాఖ అధ్యయనం చేస్తున్నది. రాష్ర్టానికి చెందిన 40 మంది టీచర్లు, లెక్చరర్లు, అధికారులతో కూడిన బృందం ఫిన్లాండ్ దేశంలో పర్యటిస్తున్నది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్, వెంకటేశ్వర్లు(డీఈవో), జ్యోత్స్న(ఇంటర్ విద్య), టీచర్లు వీ పద్మప్రియ, వుడుత మహేష్‌చంద్ర తదితరులున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ బృందం పలు పాఠశాలలను సందర్శించి, అక్కడి అధికారులతో భేటీ అయ్యింది. అక్కడ ఒకటి ఆపై తరగతులకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో ఉంది. 45 నిమిషాల తరగతి గది బోధన.. ఆ తర్వాత ప్రతి పీరియడ్కూ 15 నిమిషాల విరామం ఇస్తున్నారు. ఈ బృందం అధ్యయనం చేసిన కొన్ని అంశాలను, ఆ దేశ విద్యావిధానం విశేషాలను విద్యాశాఖ విడుదల చేసింది.