Ice cream | గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5 వేలు జరిమానా
Ice cream | తమ గ్రామంలో నాసిరకం ఐస్‌క్రీమ్ అమ్మితే జరిమానా విధిస్తామని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ హెచ్చరించారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా పోతంగల్ హంగర్గ గ్రామానికి వెళ్లే ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
పోతంగల్ : తమ గ్రామంలో నాసిరకం ఐస్‌క్రీమ్ ( Ice cream ) అమ్మితే జరిమానా విధిస్తామని గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ హెచ్చరించారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా ( Nizamabad District) పోతంగల్ హంగర్గ గ్రామానికి ( Hangraga Village) వెళ్లే ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
సర్పంచ్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ బయటి నుంచి వచ్చే తోపుడు బండ్లలో నాణ్యత లేని, రంగు,రసాయనాలు కలిపిన ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నారని వీటి వల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని అన్నారు. దీంతో పాటు నాసిరకం చిప్స్ ప్యాకెట్ అమ్మవద్దని, జంక్ఫుడ్స్ నిషిద్దమని తెలిపారు .అనంతరం శివాజీ చౌక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపి, గ్రామ కార్యదర్శి గంగారాం, భజరంగ్, గోవింద్, ఉమ్మార్,జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

