హైదరాబాద్, సెప్టెంబర్16(నమస్తే తెలంగాణ): జీఎస్టీ ధరల తగ్గింపులో తనదే ప్రముఖ పాత్ర అని ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. జీఎస్టీలో సులభమైన విధానం తెచ్చేందుకు ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయని, జీఎస్టీ కౌన్సిల్ సభ్యుడిగా ప్రజల తరఫున నిర్ణయాలు తీసుకోవడంలో తాను ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో మంగళవారం ఎంసీహెచ్చార్డీ కార్యాలయంలో వ్యాపార వర్గాలతో కలిసి ఆయన మాట్లాడారు. జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ. 5 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని చెప్పారు. సవరించిన రేట్లతో వస్తువులు తకువ ధరకు వస్తున్నాయని, వాటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.