Vijay Devarakonda | యాద్రాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శిల్ప కళా నైపుణ్యం అద్భుతంగా ఉందని సినీ నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ఆదివారం తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ టీం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో గీత అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
యాదాద్రి ఆలయం కాకతీయ, పళ్లవ, చోళ కళారీతులతో అద్భుతంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించారని ప్రశంసించారు. గతంలో కంటే ఆలయం చాలా బాగుందని చెప్పారు. ఆలయానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది మా కుటుంబానికి చాలా మంచి జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. భక్తులు, అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
My Family has been blessed this year with lots of love & Kushi ❤️
Visited the most beautiful Yadadri temple to offer our gratitude with our families.
When I was told of the powerful nature of the temple – I prayed for all of you 🥰
You all deserve utmost happiness and… pic.twitter.com/QLeCuCPHmz
— Vijay Deverakonda (@TheDeverakonda) September 3, 2023
స్వామి వారి దర్శనానికి వచ్చిన నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖుషి దర్శకులు, నిర్మాతలు, ఆలయ ఈవో ఎన్ గీత, ఆలయ పర్యవేక్షకులు రఘు, రాజన్ బాబు, రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
విజయ్ దేవరకొండ , సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి . ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ సూపర్ హిట్ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖుషి టీం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుంది. pic.twitter.com/hPENUlYLPD
— Namasthe Telangana (@ntdailyonline) September 3, 2023