హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. ముషీరాబాద్‌లో నివాసం ఉంటున్న వెంకట్ కొంతకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వెంకట్ రెండు మూత్రపిండాలు దెబ్బతినడంతో డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబసభ్యులు దాతల సాయం కోసం ఎదురుచూశారు. సినీపెద్దలను సైతం సంప్రదించారు. అంతలోనే పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.