తిమ్మాపూర్(శంకరపట్నం), ఆగస్టు 15 : తల్లి పింఛన్ డబ్బుల కోసం కొట్లాట పెట్టుకుని పంచాయతీ వద్ద వదిలిన దుర్ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంగళ లచ్చవ్వకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉండగా.. భర్త కొన్నేండ్ల కింద చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెను ముగ్గురు కొడుకులు వంతులవారీగా పోషిస్తున్నారు. శుక్రవారం ముగ్గురు కొడుకులు ఆమె పింఛన్ డబ్బుల కోసం గొడవకు దిగారు. చివరకు ఆమెను గ్రామపంచాయతీ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసుల జో క్యంతో పెద్దకొడుకు తీసుకుని వెళ్లాడు.