హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో లండన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థ ప్రతినిధులు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముందస్తు అనుమతి మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు జూమ్ మీటింగ్‌లో వర్చువల్‌గా హాజరయ్యారు. విచారణాధికారి మాజీద్ అలీ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన అధికారుల బృందం దాదాపు గంటన్నరకుపైగా వారిని ప్రశ్నించినట్టు తెలిసింది.